
తిరువూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
తిరువూరు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన తల్లి సరస్వతి (70)కొడుకు కృష్ణ (53) బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా గాంధీనగర్ గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆదివారం ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి బంధువులకు సమాచారం అందించారు.