విజయవాడ: చంద్రబాబుతోనే బీసీల అభ్యున్నతి
ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. విజయవాడ మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను బుధవారం నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మర్యాదపూర్వకంగా కలిశారు. కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్ తో పాటు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.