Oct 13, 2024, 18:10 IST/
పాకిస్థాన్‌లో రెండు తెగల మధ్య భీకర ఘర్షణ.. 11 మంది మృతి
Oct 13, 2024, 18:10 IST
పాకిస్థాన్‌లో మరోసారి రెండు తెగల మధ్య భీకర ఘర్షణ చోటుచేసుకుంది. సున్నీ, షియా ముస్లింలకు మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లోగల కుర్రమ్ జిల్లాలో ఈ ఘర్షణలు జరిగాయి. దీంతో అక్కడి పరిస్థితి తీవ్ర గందరగోళంగా మారింది.