జవహర్ నవోదయ విద్యాలయం బాపులపాడు మండలం వేలేరులో బుధవారం నుండి 8వ తారీకు వరకు జరిగే క్లస్టర్ లెవెల్ ఫీల్డ్ గేమ్స్ ను స్థల దాతలు దోనవల్లి రామారావు, వేములపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అత్యంత ఆర్భాటంగా మొదలయ్యాయి. ఆటలు పిల్లలని తమ లక్ష్యాలను చేరుకునేటువంటి మంచి పోరాట యోధులుగా తయారు చేస్తాయని వేములపల్లి శ్రీనివాస్ రావు తమ ప్రసంగంలో తెలియజేశారు.