Oct 13, 2024, 18:10 IST/
సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ (వీడియో)
Oct 13, 2024, 18:10 IST
తెలంగాణలోని వరంగల్ లో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. కానిస్టేబుల్ ఓ వ్యక్తికి సీపీఆర్(CPR) చేసి ప్రాణాలు కాపాడాడు. వరంగల్ రంగలీల మైదానంలోని రావణవధ కార్యక్రమంలో జరిగిన తోపులాటలో ఓ యువకుడు గుండెపోటుకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గమనించిన ఓ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడాడు. సకాలంలో స్పందించి సీపీఆర్ చేసి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ను పలువురు అభినందించారు.