విఆర్ కు కోడూరు ఎస్ఐ శిరీష
కోడూరు మండల ఎస్సైగా పనిచేస్తున్న పి. శిరీష విఆర్ కు వెళ్లారు. ఈ మేరకు సోమవారం జిల్లా అధికారుల నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. కోడూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా చాణిక్యను నియమించారు. ఇటీవల శిరీష పుట్టినరోజు వేడుకలను పోలీస్ స్టేషన్ ముందు రాజకీయ పార్టీల నేతలు నిర్వహించడంతో ఈ విషయం సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో ఆమెను విఆర్ కు పంపించారు.