రజినీకాంత్ ఇంటిని చుట్టుముట్టిన వర్షపు నీరు (వీడియో)

73చూసినవారు
తమిళనాడులో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నైలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వరదల కారణంగా పోయిస్ గార్డెన్‌లోని నటుడు రజనీకాంత్ ఇంటిని వర్షం నీరు చుట్టుముట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, చెన్నైలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్