గంపలగూడెం: ఘనంగా ఆచార్య ఎన్. జి. రంగా జయంతి
గంపలగూడెం మండలం పెనుగొలనులో గురువారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో భారత రైతాంగ ఉద్యమ పిత, స్వాతంత్య్ర సమరయోధులు ఎన్జి రంగా జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సుదీర్ఘకాలం భారత పార్లమెంట్ సభ్యుడిగా పని చేసి రైతాంగ సమస్యల కోసం పోరాటం చేశారని, రంగా ఆంగ్లంలో 65, తెలుగులో 15 పుస్తకాలు రచించారని టీచర్ కె. లింగమ్మ తెలిపారు.