గన్నవరం: పేదలకు వరంలా మారిన ముఖ్యమంత్రి సహాయ నిధి
పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం వరంలా మారిందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయం నందు సోమవారం పొట్టిపాడుకు చెందిన పోట్ల కృష్ణ ప్రసాద్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన రూ 6, 42, 153 చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాలకు కార్పొరేట్ వైద్యం అందించటం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుందని అన్నారు.