ఏపీని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు కీలక పర్యాటక ప్రాజెక్టులు అమలు చేయబోతున్నామని పవన్ ప్రకటన చేశారు. కేంద్రం నుంచి సహాయ సహకారాల కోసం నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో పవన్ భేటీ అయ్యారు. ఏపీకి 975 కి.మీ సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉండటంతో పర్యాటక రంగాభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.