గన్నవరం: రహదారుల అభివృద్ధికి అవసరమైన చర్యలు

50చూసినవారు
గుంతల రహిత జిల్లా లక్ష్యంగా రహదారుల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన గుంతల రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం గన్నవరం మండలంలోని కేసరపల్లి గ్రామంలో నియోజకవర్గం పరిశీలకులు వడ్రానం హరిబాబు, టిడిపి నాయకులు యార్లగడ్డ సతీష్ బాబుతో కలిసి రహదారుల మరమ్మత్తులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్