మండవల్లి మండలం లోని పెనుమాక లంక గ్రామం లో నేడు (శనివారం) మాజి మంత్రి కామినేని శ్రీనివాస్ మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించ నున్నారు. గ్రామ నాయకులు కోరిక మేరకు కామినేని శ్రీనివాస్ రూ. 15 లక్షలు తన సొంత నిధులతో ఆధునిక సాంకేతికతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు మినరల్ వాటర్ ప్లాంట్ ను అందుబాటులోకి తెచ్చారనీ సర్పంచ్ ముంగర నాగరాజు తెలిపారు.