నరసాపురం: ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య
ఏలూరు జిల్లాలోని కైకలూరు మండలంలో గల భుజబలపట్నం గ్రామానికి చెందిన కుందుర్తి సాయి శివసూరజ్ (18) అనే విద్యార్థి పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ వద్ద ఉన్న తితిదే వేద పాఠశాలలో శ్రీవేదంలో నాల్గొ తరగతి చదువుతున్నాడు. అయితే గురువారం రాత్రి ఉరి వేసుకుని వేలాడుతుండగా తోటి విద్యార్థులు గమనించగా అతన్ని నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటివరకే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.