పెనమలూరు: కూటమి ప్రభుత్వ ఉత్తర్వులు బేకాతర్
కూటమి ప్రభుత్వ ఉత్తర్వులను వ్యవసాయ శాఖ అధికారులు బేఖాతర్ చేస్తున్న ఘటన సోమవారం వెలుగు చూచింది. రైతు భరోసా కేంద్రాలను, కూటమీ ప్రభుత్వం వచ్చాక రైతు సేవ కేంద్రాలుగా పేరు మార్పు చేసింది. అయితే దానికి విరుద్ధంగా కంకిపాడు మండలం పునాదిపాడులో రైతు భరోసా కేంద్రం పేరుని మార్చకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా యంత్రాంగం స్పందించాలని రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు.