పెనమలూరు: త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
గుడివాడ నియోజకవర్గంలోని త్రాగునీటి దుస్థితిపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. సోమవారం కంకిపాడులో రాష్ట్ర స్థాయి పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గుడివాడ నియోజక వర్గంలోని గ్రామాల నీటి సమస్యలను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడంతో త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.