కోడూరు: అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
కోడూరు నుంచి ద్విచక్ర వాహనంపై అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు కోడూరు ఎస్సై చాణిక్య తెలిపారు. మంగళవారం స్థానికులు తెలిపిన సమాచారం మేరకు కోడూరు నుంచి నరసింహపురం వైపుకు ముప్పిరిశెట్టి శివయ్య అనే వ్యక్తి తరలిస్తున్న 45 మద్యం బాటిల్లను స్వాధీన పరుచుకున్నామన్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.