హంసలదీవి బీచ్ లో యువకుడు గల్లంతు
కోడూరు మండలం హంసలదీవి సాగరతీరంలో సముద్ర స్నానాలకు ఆదివారం గుడివాడకు చెందిన ఐదుగురు వచ్చారు. కాగా సముద్రంలో స్నానం చేస్తుండగా, అయిదుగురు వ్యక్తులు అలల తాకిడికి కొట్టుకొని పోతుండగా, స్థానికులు, మెరైన్ సిబ్బంది నలుగురి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఒక యువకుడు సముద్రంలో గల్లంతు అయినట్లు స్థానికులు తెలిపారు. నలుగురు వ్యక్తులు సముద్రపు నీరు తాగడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.