ఘనంగా సభ్యత్వ నమోదు
బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు కృత్తివెన్ను మండల వ్యాప్తంగా ఆదివారం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్విరామంగా జరిగింది. కూటమి గెలుపు తర్వాత భారతీయ జనతా పార్టీ జోరు పెంచింది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాజబాబు కృత్తివెన్నులో మాట్లాడుతూ దేశానికి గొప్ప భరోసా నరేంద్ర మోడీ నాయకత్వం అని, ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకి భారతీయ జనతా పార్టీ మీద ఆదరణ పెరుగుతుందని అన్నారు.