కృత్తివెన్నులో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రవేటు బస్సు బోల్తా
కృత్తివెన్ను మండలం ఎండపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బుధవారం బోల్తా పడింది. మొగల్తూరు నుంచి వస్తున్న ట్రావెల్ బస్సు యండపల్లి వద్ద ఎదురుగా వస్తున్నకారును తప్పించబోయి బోల్తా పడింది. బస్సులో మొత్తం తొమ్మిది మంది ప్రయాణికులు ఉండగా ముగ్గురికి గాయాలయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.