నేటి నుంచి చిన్నారులకు ఆధార్ క్యాంపులు

60చూసినవారు
నేటి నుంచి చిన్నారులకు ఆధార్ క్యాంపులు
AP: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి 0–6 ఏళ్లు గల చిన్నారుల కోసం ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21–24, 27-30 వరకు ఆధార్ నమోదు చేయనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,06,264 మంది చిన్నారుల్లో 9,80,575 మంది నేటికీ ఆధార్ నమోదు చేసుకోలేదని గణాంకాలు చెబుతున్నాయి. కార్య క్రమం విజయవంతం చేయాలని ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్