వ్యక్తి దారుణ హత్య
కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం ఊటుకూరులో శనివారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. ఊటుకూరు గ్రామానికి చెందిన పోసిన బాల కోటయ్య (55)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పాతకక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.