Oct 20, 2024, 01:10 IST/చొప్పదండి
చొప్పదండి
కోతకు గురైన రహదారికి మరమ్మతులు చేయాలి: శ్రీధర్
Oct 20, 2024, 01:10 IST
బోయినపల్లి మండలంలోని కొదురుపాక గ్రామం నుంచి విలాసాగర్ కు వెళ్లే ప్రధాన రహదారి గత వర్షాలకు కోతకు గురై ప్రమాదకరంగా మారిందని సీపీఎం మండల కన్వీనర్ గురిజాల శ్రీధర్ శనివారం అన్నారు. కోతకు గురైన రహదారులతో రాత్రి వేళలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.