ఏపీకి తుఫాన్ ముప్పు.. 5 రోజులు వానలు

51చూసినవారు
ఏపీకి తుఫాన్ ముప్పు.. 5 రోజులు వానలు
ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. అండమాన్‌లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 21 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది 23 నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీనివల్ల ఆదివారం నుంచి 5 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 24, 26 మధ్య ఒడిశా లేదా ఉత్తరాంధ్రలో తుఫాన్ తీరం దాటనుందని వివరించింది.

సంబంధిత పోస్ట్