Sep 10, 2024, 15:09 IST/
నిమజ్జనం విషయంలో ఘోరంగా కొట్టుకున్న యువకులు (వీడియో)
Sep 10, 2024, 15:09 IST
వినాయకుని నిమజ్జనం విషయమై యువకులు బహిరంగా ఘర్షణకు దిగిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగింది. స్థానిక సొసైటీ కాలనీలోని భాస్కర్ పాల డిపో సమీపంలో వినాయకుడి మండపం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం పూజలు ముగించారు. సాయంత్రం నిమజ్జనం చేయాలని ఓ వర్గం.. మంగళవారం చేద్దామని మరో వర్గం వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.