సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కోడి జగన్నాథ స్వామి విగ్రహం ముందు వంగి, కళ్లు మూసుకుని ప్రార్ధనలు చేయడం కనిపిస్తుంది. అలా దాదాపు కొన్ని సెకన్లపాటు అలాగే మనుషుల లాగా కళ్లు మూసుకుని మనసులో స్మరించడం వీడియోలో చూడొచ్చు. భగవంతుని ముందు ప్రార్ధిస్తూ జగన్నాథ స్వామి ఆశీస్సులు కోరుతున్నట్లు కనిపిస్తుంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.