యూపీలోని బులంద్‌షహర్‌లో తన పెంపుడు చిలుక తప్పిపోవడం దాని యజమానిని బాగా కుంగదీసింది. దీంతో తన చిలుకను వెతికి పెట్టిన వారికి ఆ వ్యక్తి భారీ నజరానా ప్రకటించాడు. నవీన్ పాఠక్ అనే వ్యక్తి కొన్నాళ్లుగా ఓ చిలుకను పెంచుకుంటున్నాడు. డిసెంబర్ 10న ఆ చిలుక కనిపించకుండా పోయింది. బాధతో ఇంట్లో పిల్లలు భోజనం కూడా మానేశారు. దీంతో చిలుకను వెతికి తెచ్చిన వారికి రూ.లక్ష ఇస్తానని నవీన్ ప్రకటించాడు.