దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. మూడో తేదీ నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.