భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలో ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును సీఎం సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.