విజయవాడలో ఇంటి వద్దే ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు
ఆరు నుండి తొమ్మిది మాసాల పాటు రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ ను నిర్వహించే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. గురువారం విజయవాడలో పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ రోగులను దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ పై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.