సిరిసిల్ల: పకడ్బందీగా సర్వే నిర్వహించాలి: అడిషనల్ కలెక్టర్

63చూసినవారు
సిరిసిల్ల: పకడ్బందీగా సర్వే నిర్వహించాలి: అడిషనల్ కలెక్టర్
పకడ్బందీగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్లో సర్వేకు సంబంధించిన అధికారులకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో లక్ష 90 వేల 626 ఇండ్లను గుర్తించామని, సర్వే నిర్వహణకు 1488 ఎన్యుమరేటర్లు, 160 మంది సూపర్వైజర్లను నియమించినట్లు పేర్కొన్నారు. 1468 ఎన్యుమరేషన్ బ్లాక్లు ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్