విజయవాడ వరద బాధితులకు మంగళవారం కల్లూరులో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి టీడీపీ నాయకులు చెక్కులు అందజేశారు. కల్లూరు అర్బన 33వ వార్డు టీడీపీ నాయకులు ఎన్ వి రామకృష్ణ, రైతుసంఘం నేత సంపతి లక్ష్మీరెడ్డి, పోలిరెడ్డి, వరద బాధితుల సహాయార్థం రూ. 1, 40, 000 చెక్కును అందజేశారు. అలాగే పర్ల గ్రామ నాయకులు రూ. 2, 51, 116, సల్కాపురం టీడీపీ నాయకుడు దేవేందర్ రెడ్డి 1, 10, 116 లక్షలతో పాటు, పలువురు చెక్కులను అందజేశారు.