

పాణ్యం: ఆర్టీసీ బస్సుపైకి దూసుకెళ్లిన భారీ ట్యాంకర్
పాణ్యం మండల సుగాలిమెట్ట వద్ద జాతీయ రహదారిపై ఓ భారీ వాహనం ఆర్టీసి బస్సును ఢీకొట్టింది. బుధవారం స్థానికుల సమాచారం మేరకు నంద్యాల నుంచి కర్నూలు వైపు వెళ్లుతున్న భారీ ట్యాంకర్ వాహనం అదుపుతప్పి రోడ్డుపై ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొని డివైడర్ పైకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరకి గాయాలు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్యాంకర్ ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది.