ఎమ్మిగనూరు కస్తూర్బా స్కూల్లో విద్యార్థుల ఆకలి కష్టాలు

59చూసినవారు
ఎమ్మిగనూరు కస్తూర్బా స్కూల్లో విద్యార్థుల ఆకలి కష్టాలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు ఆకలితో అలమటించిపోతున్నారు. గత కొన్ని రోజులుగా పాఠశాలలో వంట సిబ్బంది మధ్య గొడవలు జరుగుతుందటంతో, అక్కడ వంట సరిగ్గ చేయలేకపోతున్నారు. విద్యార్థులు సరైన సమయంలో భోజనం చేయలేక ఆకలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల సిబ్బంది నిన్నటి రోజు రాత్రి విద్యార్థులకు అన్నం పెట్టక, ఉదయం టిఫిన్ కూడా లేటుగా పెట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు వెంటనే స్పందించి, మాకు సరైన ఆహారం పెట్టేలా చర్యలు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.