
ఎమ్మిగనూరు: వైసీపీ సాంస్కృతిక ప్రధాన కార్యదర్శిగా రాజారత్నం
ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శిగా పి. రాజారత్నం నియమితులయ్యారు. శనివారం వైసీపీ ఇంచార్జి బుట్టా రేణుక, బుట్టా శివనీలకంఠను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, బుట్టా రేణుకను గెలిపించేందుకు సమష్టిగా పని చేస్తామని తెలిపారు. ఈ అవకాశం తనపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.