ఆదోని మండలంలోని కుప్పగల్ గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి అనే వ్యక్తి అక్రమంగా బెల్టు షాపు నిర్వహిస్తుండగా అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు పెద్దతుంబళం ఎస్ఐ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిమ్మారెడ్డి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి, అదుపులోకి తీసుకుని, 41 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.