ఆదోని నియోజకవర్గంలో అక్రమ గరుసు, మట్టి తవ్వకాలపై ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి నోరు మెదపడంలేదని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్అహ్మద్ అన్నారు. ఆదివారం ఆదోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కూటమి నాయకుల ఆగడాలను ఎమ్మెల్యే అరికట్టలేకపోతున్నారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయన్నారు.