వైద్య శిబిరానికి విశేష స్పందన

83చూసినవారు
ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో గల టిట్కో గృహాల వద్ద ఆళ్లగడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహ ఆధ్వర్యంలో మంగళవారం రోజున ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. టిట్కో గృహాలలో ఉన్న ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రజల వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు.

సంబంధిత పోస్ట్