Dec 27, 2024, 07:12 IST/ఎల్బీనగర్
ఎల్బీనగర్
ఎల్బీనగర్: మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు
Dec 27, 2024, 07:12 IST
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్బీనగర్ లో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశాన్ని ప్రగతి పథంలో నిలిపిన మహోన్నత నాయకుడు మన్మోహన్ సింగ్ అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.