పంచాయతీ సెక్రెటరీ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సస్పెండ్
నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశాల మేరకు బనగానపల్లె మండలం పరిధిలోని లేఔట్ల భవన నిర్మాణాలను నిబంధనలకు వ్యతిరేకంగా అనుమతులు మంజూరు చేసిన పంచాయతీ సెక్రెటరీ, గ్రేడ్ -2 ఖలీల్ భాషను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ మైలవరపు కృష్ణ తేజ ఉత్తర్వులు మంగళవారం జారీ చేశారు. భవన అనుమతులను సరిగా పర్యవేక్షించని ఎక్స్టెన్షన్ ఆఫీసర్ శివరామయ్యను కూడా సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు.