'మిస్టర్ బీస్ట్'గా పేరొందిన యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్సన్ తాజాగా బుర్జ్ ఖలీఫాను అధిరోహించారు. ప్రపంచంలోనే ఎత్తైన మానవ నిర్మిత భవనంగా బుర్జు పేరుంది. ఇప్పటి వరకు ఆ భవనాన్ని ఏడుగురు ఎక్కగా బీస్ట్ 8వ వ్యక్తిగా, తొలి యూట్యూబర్ నిలిచారు. ఆయన పైకి చేరుకున్న వీడియో వైరల్ అవుతోంది. పలు విచిత్రమైన, సాహసోపేతమైన పనుల్ని చేస్తూ, వాటిని వీడియోలు తీసి పోస్ట్ చేయడం ద్వారా బీస్ట్ పేరు సంపాదించుకున్నారు.