మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె మండలం గులభినబీపేటలో జరుగుతున్న గుంతల రోడ్ల నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించారు. నాణ్యత విషయంలో రాజీ లేకుండా పకడ్బందీగా గుంతలను పూడ్చాలని అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.