బనగానపల్లె పట్టణము 5వ సచివాలయం నందు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించడం జరిగిందనీ డాక్టర్ సిహెచ్ యస్ శివశంకరుడు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సి హెచ్ ఎస్ శివశంకరుడు, ఎంపీహెచ్ ఈఓ నల్లగట్ల వెంకటేశ్వర్లులు మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా మగ ఆడ అనే లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని వారు కోరారు. రమేష్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.