కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి శుక్రవారం పెన్షన్లు పంపిణీ చేశారు. ముందుగా మంత్రికి కలుగొట్ల గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. పెన్షన్ లబ్దిదారుల ఇళ్ల దగ్గరకు స్వయంగా వెళ్లి పెన్షన్ మొత్తాలను మంత్రి అందజేసారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.