సంజామల మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో నాగులచవితి వేడుకలను గురువారం భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో మహిళలు నాగులపుట్టకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నాగులపుట్ట వద్దకు వెళ్లి నైవేద్యంగా తెల్ల, నల్ల నూగుపిండి వంటకాలు సమర్పించుకొని పుట్టలో పాలు పోసి భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. నాగదేవత విగ్రహాలకు భక్తులు పసుపు, కుంకుమ, చీరలను సమర్పిస్తున్నారు.