బేతంచర్ల: ముగ్గురు నాటు సారాయి విక్రేతలు అరెస్ట్
బేతంచర్ల మండల పరిధిలోని గుటుపల్లే, కొలుముల పల్లె, గ్రామాలలో నాటు సారాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు మంగళవారం దాడులను నిర్వహించినట్లు ఏఎస్ఐ వెంకట నారాయణ,హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ దాడులలో గూటిపల్లెలో నాట సారాయి విక్రయిస్తున్న గుర్రమ్మ నుంచి25 లీటర్ల కొలములపల్లి గ్రామంలో కురువ వంశీ, శేఖర్ ల నుంచి 20 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకొని వారి అరెస్ట్ చేసినట్లు ఏఎస్ఐ,హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.