ఇసుకను ఉచితంగా ఇస్తామంటూ ఎన్నికల ముందు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ప్రతి ఎన్నికల ప్రచార సభలలో హామీ ఇచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, బేతంచెర్ల స్థానిక పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ లో రాస్తారోకో శుక్రవారం నిర్వహించారు.