Apr 05, 2025, 06:04 IST/
పిజ్జా ఇవ్వలేదని రెస్టారెంట్ సిబ్బందిని కొట్టిన యువకులు (వీడియో)
Apr 05, 2025, 06:04 IST
యూపీలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లోని అజ్నారా మార్కెట్లోని ఒక రెస్టారెంట్లో పిజ్జా ఇవ్వలేదని గాంధీ విహార్ ప్రాంతానికి చెందిన యువకులు రెస్టారెంట్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారు. రెస్టారెంట్ మూసివేసే సమయంలో వచ్చి పిజ్జా కావాలని అడగడంతో.. వారు సమయం అయిపోయిందని చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు సిబ్బందిపై దాడికి దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.