తిరుపతిలో హోం స్టే నిర్వాహకుల వార్

79చూసినవారు
తిరుపతిలో హోం స్టే నిర్వాహకుల వార్
AP: తిరుపతిలో రెండు హోం స్టేల వార్ సంచలనంగా మారింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చింతలచేనులో రెండు హోం స్టేల మధ్య ఘర్షణ జరిగింది. ఒక హోం స్టేకు వచ్చే కస్టమర్లకు మరో హోం స్టే వాళ్లు లాక్కెళుతున్నారని నిర్వాహకుల మధ్య వివాదం చెలరేగింది. హోమ్ స్టే నిర్వాహకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో స్టే నిర్వాహకులు నరేశ్, నవీణ్, లక్ష్మీనారాయణ, ఫణిందర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్