స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, తన పరిపాలన దక్షతతో యావత్ భారతదేశానికి విశేష సేవలు అందించిన మాజీ ఉపరాష్ట్రపతి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి నేడు. ఈయన 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రం చాంద్వా గ్రామంలో పుట్టారు. 1936లో 27 ఏళ్ళకే అతి చిన్న వయసులో పార్లమెంట్ సభ్యునిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 50 ఏళ్లు పార్లమెంటు సభ్యునిగా ప్రపంచ రికార్డు సాధించారు.