తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఈ నెల నుంచి సన్న బియ్యం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఉగాది పండుగ సందర్భంగా సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో రేషన్ దుకాణాల్లో శనివారం ఉదయం నుంచి సర్వర్ సమస్య తెలెత్తింది. సర్వర్ మొరాయించడంతో బియ్యం పంపిణీ నిలిచిపోయిందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, చౌక ధరల దుకాణాల వద్ద రేషన్ కార్డుదారులు నిరీక్షిస్తున్నారు.